మన పూర్వికుల ఆరోగ్య రహస్యమేంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకేముంది 'రాగి' పాత్రలే! అవును.. నీటిని నిల్వ చేసుకోవడానికైనా, ఆహారాన్ని వండుకోవడానికైనా, వండిన ఆహారం తినడానికి వీటిని వాడేవారు
TV9 Telugu
ఇలా ప్రతి దానికీ వారు రాగి పాత్రలనే ఉపయోగించేవారు. అందులోని సకల పోషకాలు తీసుకునే ఆహారంలో చేరి.. అవి శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడేవి
TV9 Telugu
ఈ క్రమంలో రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం, రాగి పాత్రల్లో ఆహారం తినడం.. వంటి వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం
TV9 Telugu
ప్రస్తుత కాలంలో రకరకాల రాగి బాటిళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిల్లో నిల్వ చేసిన నీళ్లు తాగే ట్రెండ్ కూడా ఎక్కువైంది. ఈ నీటిని సరిగ్గా తాగితే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది
TV9 Telugu
నిజానికి, రాగి శరీరానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది శరీరానికి శక్తిని అందించడమే కాకుండా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. రాగి బాటిల్‌లోని నీటిని తాగడం ద్వారా, శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు
TV9 Telugu
ఇది రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రాగిలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులోని నీరు శరీరాన్ని సహజమైన రీతిలో నిర్విషీకరణ చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది
TV9 Telugu
అందుకే చాలా మంది ఉదయాన్నే ఈ నీటిని తాగుతుంటారు. అయితే రాగి బాటిల్‌లో 8 గంటల కంటే ఎక్కువ సమయం నీరు ఉంచితే అది వేడిగా మారుతుంది. దీని వల్ల శరీరానికి హాని కలుగుతుంది. అలాగే రోజుకు 2 గ్లాసుల కంటే ఎక్కువ తాగకూడదు
TV9 Telugu
రాగి ఎక్కువైతే శరీరానికి హాని కలిగిస్తుంది. అందువల్ల నిపుణులతో సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ నీటిని తాగాలి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎసిడిటీ, కిడ్నీ, గుండె, విల్సన్ వ్యాధులతో బాధపడేవారు ఈ నీటిని తాగకూడదు