పొద్దున్నే ఎన్ని నీళ్లు తాగాలి..? 

June 09, 2024

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో పెరుగు ఒకటి. ఇందులోని  ప్రొబయోటిక్స్ పొట్టలోని మంచి బాక్టీరియాను పెంచుతాయి. అలాగే చేపలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే

TV9 Telugu

నిజానికి పొద్దునే లేవగానే మనం చేసే పనులే రోజు మొత్తాన్నీ ప్రభావితం చేస్తాయి. అందుకే పొద్దునే లేవగానే పరగడుపున నీళ్లు తాగాలని చెబుతారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

ఇలా చేయడం చర్మానికి మంచిది. కిడ్నీ సమస్యలు, వాటిలో రాళ్లు ఏర్పడే ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

TV9 Telugu

ఎండాకాలంలో అయితే శరీరంలో తగినంత హైడ్రేషన్‌ ఉండటానికి దోహదపడుతుంది. రాత్రంతా నీళ్లు తాగం కాబట్టి, లేవగానే నీళ్లు తాగితే మెదడుకు తగినంత ఆక్సిజన్‌ సరఫరా కావడానికి నీళ్లు ఉపకరిస్తాయి

TV9 Telugu

పైగా నీళ్లు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. ఇక పొద్దునే ఎన్ని నీళ్లు తాగాలంటే.. నోరు శుభ్రం చేసుకున్న తర్వాత కనీసం రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్లు తాగాలి

TV9 Telugu

గోరువెచ్చటివి గానీ, వేడివి గానీ అయితే మరీ మంచింది. మరో మాట నీళ్లు తాగిన అరగంట తర్వాతే ఏదైనా తినాలి. వెంటనే తినేయకూడదు

TV9 Telugu

తిన్న ఆహారం అరగటానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వీటి స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి. ఉదయాన్నే నీళ్లలో కాసిన్ని నిమ్మరసం చుక్కలు కలిపి తాగితే ఆహారం జీర్ణం కావటానికి దోహదం చేస్తాయి

TV9 Telugu

రోజుని ఆరోగ్యంగా ప్రారంభిస్తే అప్పుడు రోజంతా ఆనందమే! అంటున్నారు నిపుణులు. అందుకు సాయపడే మంచినీళ్లను తప్పనిసరిగా తాగాలి. వీటిని తీసుకుంటే ఉత్సాహంగానే కాదు ఆరోగ్యంగానూ ఉండవచ్చు