ఇంటి నుంచే పని చేస్తున్న మీకు ఆఫీసుకు వెళ్ళాల్సి వస్తే .. టీమ్‌తో ఒక్కసారిగా కలిసి పని చేయాలంటే ఆందోళనగా ఉందా?
ఇంటి నుంచి పనికి అలవాటుపడి.. ఆఫీసుకి రమ్మనగానే చాలామంది ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ప్రయాణాలు ఎలా ప్లాన్ చేయాలంటూ కంగారుపడుతుంటారు. కానీ.. దీంతో లాభాలే ఎక్కువ.
అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునేప్పుడు జరిగే చర్చలు మరిన్ని కొత్త ఆలోచనలకు బీజం వేస్తాయి. ఇతరుల అనుభవాలు కెరియర్‌కి చాలా సాయపడతాయి.
ముఖ్యంగా కచ్చితమైన పనివేళలు ఉంటాయి. అర్ధరాత్రి వరకూ పనిచేస్తూ ఉండనక్కర్లేదు. అందుకే ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేయడం మంచిది.
ఇప్పటికే చాలామంది సంస్థలకు వెళ్లడం మొదలుపెట్టారు అలవాటుపడ్డారు. కాబట్టి, కంఫర్ట్‌జోన్ నుంచి పక్కకు వచ్చి మానసికంగా సిద్ధమైపోండి.
ఇక పని.. ఇంట్లో నింపాదిగా చేయడం అలవాటైతే.. ఒక్కసారిగా వేగంగా చేయలేయమన్న కంగారు ఉంటుంది. నెమ్మదిగా వేగం పెంచుకోండి పర్లేదు.
చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ కొత్త వాతావరణానికి అలవాటు పడండి. ఏది ముందు ఏది తర్వాత చేయాలన్న స్పష్టత వస్తే మీరే కుదురుకుంటారు.
ఇంట్లో నచ్చినట్లుగా ఉండొచ్చు. జనాల మధ్య అదేపనిగా కూర్చొని చేయాలంటే విసుగొస్తుంది. కాబట్టి, ఆత్మీయుల ఫొటోలు, పచ్చని మొక్కలతో డెస్క్‌ను అందంగా తీర్చిదిద్దండి.