పెరుగుతో ఇలా చేశారంటే జుట్టు పట్టుకుచ్చులా పెరుగుతుంది
28 December 2023
TV9 Telugu
కమ్మని గడ్డ పెరుగు తింటే జీర్ణ సమస్యలన్నీ దూరం అవుతాయి. పెరుగు పొట్టకే కాదండోయ్.. జుట్టుకీ మంచిదే అంటున్నారు నిపుణులు
పెరుగుతో కలిపి వేసుకునే కొన్ని హెయిర్ ప్యాక్స్ పలు రకాల జుట్టు సమస్యలను పోగొట్టి వెంట్రుకలకు పుష్టినిచ్చి, ఆరోగ్యంగా మారుస్తాయి. ఈ ప్యాక్స్ ఇవే..
జుట్టు మృదువుగా, బలంగా తయారు కావాలంటే పెరుగు, మినుములతో ఈ ప్యాక్ ప్రయత్నించండి. మినుములు - అర కప్పు, పెరుగు - అర కప్పు చొప్పున తీసుకోవాలి
మినుముల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి
ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పట్టించి అరగంట తర్వాత గాడత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి
ఈ ప్యాక్ వల్ల జుట్టు దృఢంగా, మృదువుగా తయారవుతుంది. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు
జుట్టు చివర్లు చిట్లిపోయి ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే.. కప్పు గడ్డ పెరుగులో మెంతుల పొడి పావు కప్పు వేసి పేస్ట్‌లా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి
ఈ పేస్ట్‌ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు, మాడుకూ పట్టించి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకుంటే సరి
ఇక్కడ క్లిక్ చేయండి