నల్ల నువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా..?

Jyothi Gadda

22 November 2024

TV9 Telugu

నువ్వులు రెండు రంగుల్లో ఉంటాయి. ఈ రెండు వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటి లక్షణాలను బట్టి తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే సూపర్ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి.

TV9 Telugu

నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శక్తివంతమైన రోగనిరోధక మాడ్యులేటర్. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

TV9 Telugu

దగ్గు, గొంతునొప్పి, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్నవారు నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల మంచి లాభాలను పొందుతారని పరిశోధనల్లో తేలింది. ఇది శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. 

TV9 Telugu

మంటను తగ్గించి అలెర్జీని నివారిస్తుంది. సైనసైటిస్ సమస్యను తగ్గించుకోవడానికి కూడా నల్ల నువ్వులు ప్రయోజనకరం. నల్ల నువ్వులు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మంచిది. 

TV9 Telugu

నల్ల నువ్వులు తినటం వల్ల డయాబెటిస్ పేషెంట్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి.

TV9 Telugu

ల్ల నువ్వుల్లో లినోలెయిక్ ఆమ్లం, ఒలేయిక్ ఆమ్లం వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.

TV9 Telugu

నల్ల నువ్వులు అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అందుకే వీటిని హైబీపీ ఉన్నవారు తినాలని చెప్తుంటారు. స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి. 

TV9 Telugu

నల్ల నువ్వుల నూనెతో రొమ్ములను మసాజ్ చేయడం వల్ల రొమ్ములో నొప్పి తగ్గుతుంది. అలాగే నల్ల నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. 

TV9 Telugu