ఇది బెరడు కాదు, అమృతం..ప్రాణాంతక వ్యాధులకు రామబాణం లాంటి దివ్యౌషధం..!
Jyothi Gadda
ఆయుర్వేదంలో అనేక చెట్లు, మొక్కలు వాటి ప్రయోజనాల గురించి వివరించారు. ఈ చెట్లలో ఎక్కువ భాగం అడవుల్లోనే కనిపిస్తాయి. వాటి బెరడు నుంచి ఆకుల వరకు ఎన్నో వ్యాధులకు ఉపయోగపడతాయి. అలాంటిదే అర్జున బెరడు కూడా.
ఇది గుండె బ్లాక్ లను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అద్భుతమైన మూలికగా చెప్పవచ్చు. అర్జున బెరడు ప్రయోజనాలను ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా వర్ణించారు.
అర్జున మొక్క ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. అందుకే దీనిని ఋగ్వేదంలో కూడా ప్రస్తావించారు. అర్జున బెరడు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. అర్జున బెరడు వాడకం గుండె సంబంధిత వ్యాధులకు దివ్యౌషధం వంటిది.
హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అనేక గుండె సంబంధిత వ్యాధులలో అర్జున బెరడు ఉపయోగం, దాని ప్రయోజనాలపై ఇప్పటివరకు చాలా అధ్యయనాలు జరిగాయి. ఆయుర్వేదంలో కషాయాల రూపంలో వాడే ప్రస్తావన ఉంది.
అర్జున బెరడులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని అనేక రకాల సమస్యలను దూరం చేస్తుందని తెలిపారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతోపాటు SDL స్థాయిని పెంచుతుంది.
అర్జున బెరడులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని అనేక రకాల సమస్యలను దూరం చేస్తుందని తెలిపారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతోపాటు SDL స్థాయిని పెంచుతుంది.
అర్జున బెరడు యొక్క చిన్న ముక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం దానిని మరిగించి, వడపోసి త్రాగాలి. ఈ కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అర్జున బెరడు గొంతు ఇన్‌ఫెక్షన్‌ను పోగొట్టడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దగ్గు, ఇన్‌ఫెక్షన్, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అర్జున ట్యాబ్లెట్లు, పౌడర్ కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.