18 April 2024
TV9 Telugu
Pic credit - Pixabay
వేసవి కాలంలో విపరీతంగా చెమట పడుతుంది. చెమట రూపంలో సోడియం, ఎలక్ట్రోలైట్లను కోల్పోయి డీహైడ్రేషన్ బారిన పడతారు.
వేసవిలో ప్రజలు ఎక్కువ నీరు తాగుతారు. అయితే చాలా చల్లని నీరు, మజ్జిగ తాగినా, కొబ్బరి నీళ్లు ఇలా ఎన్ని తాగినా ఉపశమనం కలగదు.
అప్పుడు తాగే నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగడం వలన శరీరానికి కొంత ప్రయోజనం కలుగుతుంది. డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది
చెమట రూపంలో సోడియం మాత్రమే కాదు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతాము. అందుకే నీటిలో ఉప్పును కలిపి తాగితే తిరిగి శరీరానికి సోడియం అందుతుంది
తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారికి లేదా ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సిన వారికి ఉప్పు నీరు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కలిపి ఉప్పుని తీసుకుంటే కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కావాల్సిన ఆమ్లాలు తగినంతగా ఉత్పత్తి అవుతాయి. అజీర్ణం బాధ తగ్గుతుంది.
ఉప్పు నీటిని అందరూ తీసుకోకూడదు. రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఉప్పునీటిని తీసుకోబోయే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.