మలబద్ధకం సమస్యకు పెరుగు, జీలకర్ర చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
ఇక జీర్ణ సంబంధిత సమస్యలైన కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలకు కూడా ఇది దివ్యౌషధం. రెగ్యులర్‌గా తీసుకుంటే కడుపు చల్లబడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు కూడా పెరుగు, జీలకర్రను కలిపి తీసుకోవాలి. ఇది ఆకలిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఫలితంగా బరువు తగ్గడానకి దోహదపడుతుంది.
పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పెరుగు జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. మంచి బ్యాక్టీరియా పెరగడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
పెరుగులో ప్రిపయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు జీలకర్ర కలిపి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
రక్తపోటుతో ఇబ్బంది పడేవారికి కూడా పెరుగు, జీలకర్ర ఎంతో క్రీయాశీలకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం రక్తపోటు అదుపులో ఉంచుతుంది.
డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఇది ఒక వరంలాటిదని చెప్పాలి. పెరుగు జీలకర్ర పొడి వేసుకొని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.