బీట్‌ రూట్‌ జ్యూస్ ఆరోగ్యానికి దివ్య ఔషధం..!

Jyothi Gadda

11 May 2024

 బీట్‌ రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్‌, ఇతర పోషకాలు ఉంటాయి. అయితే బీట్‌ రూట్‌ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. బీట్‌ రూట్‌ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..

విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలలో బీట్ రూట్ కూడా ఒకటి. 

మలబద్ధకం నుండి ఉపశమనానికి తోడ్పడతాయి. వివిధ కడుపు సమస్యలను తగ్గించే గుణం కూడా ఉంది. దీర్ఘకాలం నుంచి ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్‌రూట్ ఎంతో ప్రయోజనకరమైంది. 33 శాతం కీళ్లనొప్పుల సమస్యలకు బీట్‌రూట్‌ ఔషధం.

బీట్‌రూట్‌ ఉండే బెటానిన్‌ ఆ కొవ్వును తగ్గిస్తుంది. ఇది బరువు ఎక్కువగా ఉన్నవారు, బెల్లీ ఫ్యాట్‌ ఉన్నవారు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.  రక్తపోటు అదుపు చేయడంలో కూడా బీట్‌ రూట్ జ్యూస్‌ సహాయపడుతుంది. 

రక్తపోటును తగ్గించే నైట్రేట్‌ పోషకం ఉంటుంది. హైపర్‌ టెన్షన్‌తో ఇబ్బంది పడేవారు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌లో ఉండే ఫ్రీరాడికల్స్‌, బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. 

బీట్‌ రూట్‌ జ్యూస్‌ లివర్ పై కొవ్వు పేరుకో పోగొట్టడంలో సహాయపడుతుంది. ఇందులోని పోటాషియం అధికంగా ఉంటుంది దీని వల్ల నరాలు, కండరాల సమస్యలను తగ్గించడానికి సహాయ పడుతుంది. చర్మ రక్షణలో కూడా ఏంతో దోహదపడుతుంది. 

బీట్ రూట్ లోని వర్ణద్రవ్యం శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీట్ రూట్ తినే అలవాటు ఉంటే ఆ ప్రమాదం తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

గర్భిణీలు, స్త్రీలు  బీట్‌ రూట్‌ తీసుకోవడం చాలా అవసరం. ఇందులో ఉండే ఫొలేట్‌, విటమిన్ బి అధికంగా ఉంటుంది. దీని వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం బీట్‌రూట్‌ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది.