బీట్ రూట్ జ్యూస్ వీరికి అస్సలు మంచిది కాదు..!

Jyothi Gadda

22 January 2025

TV9 Telugu

బీట్ రూట్ జ్యూస్ పుష్కలమైన పోషకాల నిధి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. దీనిలో నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా నిండి ఉంటాయి.

TV9 Telugu

బీట్ రూట్‌లోని నైట్రేట్లు రక్తనాళాలను విశాలం చేసి రక్తపోటును తగ్గిస్తాయి. వ్యాయామం చేసే ముందు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది.

TV9 Telugu

బీట్ రూట్ జ్యూస్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీట్ రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

TV9 Telugu

బీట్ రూట్‌లో క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి. బీట్ రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల మూత్రం ఎర్రగా మారే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యానికి హానిచేయదు.

TV9 Telugu

బీట్ రూట్ జ్యూస్ ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం. దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ,

TV9 Telugu

బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ, కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు. బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అనే పదార్థం కిడ్నీలో రాళ్ళ సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు.

TV9 Telugu

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా కిడ్నీ సంబంధిత ఇతర సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్ తాగడం వల్ల వారి పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

TV9 Telugu

అలర్జీ ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్ తాగడం వల్ల చర్మం ఎరుపెక్కడం, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని రకాల ఔషధాలు బీట్‌రూట్‌తో ప్రతిచర్య చూపించే అవకాశం ఉంది.

TV9 Telugu