05 March 2025
Pic credit-Pexel
TV9 Telugu
విటమిన్ ఇ చర్మానికి చాలా ముఖ్యమైన పోషకంగా పరిగణించబడుతుంది. అందువల్ల విటమిన్ ఈ ఉన్న ఆహారాన్ని తినడంతో పాటు.. విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను చర్మంపై పూయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
చర్మ సంరక్షణలో బియ్యం నీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బియ్యం కడిగిన నీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే బియ్యం నీటితో చేసిన సౌందర్య ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి.
అందమైన ముఖం కోసం బియ్యం నీరు, విటమిన్ ఇ క్యాప్సూల్ కలిపి టోనర్ తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే
బియ్యం కడిగిన నీరు చర్మానికి పోషణ ఇస్తుంది.. విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండిటిని కలిపి ముఖానికి అప్లై చేయడం వలన ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.
విటమిన్ E క్యాప్సూల్, బియ్యం నీరు కలిపి మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయడం వలన వల్ల చర్మంపై ఉన్న మచ్చలు తగ్గి.. స్కిన్ శుభ్రంగా ఉంటుంది.
బియ్యం నీరు , విటమిన్ ఇ క్యాప్సూల్స్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచేలా చేస్తుంది. ఈ మిశ్రమం చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
విటమిన్ ఇ , బియ్యం నీటి టోనర్ చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది. ఇది ముడతలు, ఫైన్ లైన్ల సమస్యను తగ్గిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.