ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ.. ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడంలో చిటికెడు పసుపు కీలక పాత్ర పోషిస్తుంది
పసుపులోని సుగుణాలు, ఔషధ గుణాలు పలు చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేయడమేకాకుండా ముఖ కాంతిని రెట్టింపు చేస్తుంది
అయితే ఒక్కోసారి పసుపును వాడే క్రమంలో మనకి తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు చర్మ అందాన్ని దెబ్బతీస్తుంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం
రోజ్‌వాటర్, పాలు, నీళ్లు, పెరుగు వంటి పదార్థాల్లో పసుపును కలుపుకొని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటుంటారు. అయితే దీనిని గంటల తరబడి అలాగే ముఖంపై ఉంచుకోకూడదు
పసుపు కలిపిన ఏ ఫేస్‌ప్యాక్ అయినా సరే 20 నిమిషాలకు మించి ముఖంపై ఉంచుకోకూడదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు
ఒకవేళ 20 నిముషాల కంటే ఎక్కువ సమయం పాటు శుభ్రం చేసుకోకుండా ఉండిపోతే ముఖంపై పసుపు రంగు మాదిరి మచ్చలు ఏర్పడడంతోపాటు మొటిమలు సైతం వస్తాయట
అలాగే పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత సబ్బుతో ముఖం శుభ్రం చేసుకోకూడదు. పేస్‌ప్యాక్ వేసుకున్న 3 లేదా 4 గంటల తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి
ముఖం కడుక్కున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకూడదు. పసుపు కలిపిన ఫేస్ ప్యాక్‌లను కళ్ల వద్ద వినియోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు