మీకూ జుట్టు విపరీతంగా రాలిపోతుందా? వారానికి 2 సార్లు ఇలా చేయండి
31 July 2024
TV9 Telugu
TV9 Telugu
ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం లాంటి పలు కారణాల వల్ల జుట్టు రాలిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. చాలా మందికి ఇదొక ప్రధాన సమస్యగా మారింది
TV9 Telugu
జుట్టు రాలకుండా ఉండేందుకు ఏవేవో నూనెలు, షాంపూలు వాడి సమస్యను మరింత జటిలం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జుట్టు రాలకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం
TV9 Telugu
నేటి కాలంలో అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎక్కువ తక్కువ ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు చాలా కారణాలున్నాయి
TV9 Telugu
చుట్టూ కాలుష్యం, నీటి సమస్య.. కొన్ని ప్రదేశాలలో అధికంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. దీంతో స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ నుంచి పడకగది వరకు ప్రతిచోటా జుట్టు రాలిపడిపోతుంది
TV9 Telugu
జుట్టు రాలే సమస్యల వల్ల డిప్రెషన్‌కు గురైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి మీ జుట్టు సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవర్ ది కౌంటర్ కెమికల్ కాస్మోటిక్స్ పై ఆధారపడకుండా.. సహజసిద్ధమైన హోం రెమెడీస్ వాడాలి
TV9 Telugu
మెంతులు, అవిసె గింజలు, కరివేపాకుతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఓ పాత్రలో నీళ్లుపోసి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిలో మెంతులు, అవిసెగింజలు, కరివేపాకులను ఒక్కొక్కటిగా వేసి 30 నుంచి 40 నిమిషాలు ఉడికించాలి
TV9 Telugu
మిశ్రమం చిక్కగా మారినప్పుడు, దానిని దించి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల వరకు అప్లై చేయాలి
TV9 Telugu
20 నుండి 25 నిమిషాలపాటు అలాగే ఉంచి, తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 రోజులు ఈ పద్ధతిని పాటిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది