అధరాలు పదిలమేనా..?

10 August 2023

Pic credit - Pexels

శరీరంలో నీటి శాతం తక్కువైతే ఆ ప్రభావం పెదాలపై పడుతుంది. తద్వారా అదరాలు నల్లగామారి, నిర్జీవంగా కనిపిస్తాయి.

ఫలితంగా పెదాలు సున్నితత్వం కోల్పోయి రంగుమారడం, పగలడం, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తి నిర్జీవంగా మారుతాయి. 

ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు సహజ పద్ధతుల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే పెదాలు లేత గులాబీ రంగులో మెరిసిపోతాయి

పెదాల మీద పేరుకుపోయే మృతకణాలను ఎప్పటికప్పుడు సహజ పద్ధతుల్లో తొలగించుకుంటే అవి తేమను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉంటాయి

ఒక టీ స్పూన్‌ పెట్రోలియం జెల్లీలో కాస్త చక్కెర కలిపి పెదాలపై మృదువుగా స్క్రబ్‌ చేసుకోవాలి రాసుకోవాలి

లేదంటే టూత్‌బ్రష్‌పై చిటికెడు చక్కెర వేసి పెదాలపై రుద్ది.. కాసేపయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గుప్పెడు గులాబీరేకుల్ని మెత్తగా పేస్టులా చేసుకుని, దానిలో చిటికెడు కొబ్బరి కోరు, బాదం నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుని మృదువుగా స్క్రబ్‌ చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చన్నీళ్లతో కడిగేసుకుంటే సరి. ఇలా వారంపాటు చేస్తే క్రమంగా లేత గులాబీ రంగు సంతరించుకుంటుంది.