తెలుసా.. ఇలా నిద్రపోతే మొటిమలొస్తాయట!

20 August 2023

పడుకోగానే కొంతమందికి నిద్రపట్టదు. పడకపై రాత్రంగా ఎంతమెసిలినా కంటికి కునుకు కరువవుతుంది. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి

ముఖ్యంగా చర్మంలో సీబమ్‌ ఉత్పత్తి పెరిగి ముఖంపై మొటిమలు పెరిగిపోతాయి. మొటిమల తాలూకు మచ్చలు ముఖంపై పెరిగి అందవిహీనంగా కనిపిస్తాయి

రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మాత్రమేకాదు నిద్ర విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా మొటిమలొచ్చే అవకాశాలు ఉన్నాయి

సాధారణంగా శరీరం నుంచి విడుదలయ్యే నూనెలు, చెమట, బ్యాక్టీరియా దిండు, దుప్పట్ల పైకి చేరతాయి. వీటిని రోజుల తరబడి ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాల్లోకి చేరిపోతాయి

ఫలితంగా ముఖంతోపాటు భుజాలపై మొటిమలొస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కనీసం వారానికోసారైనా దిండు కవర్లు, దుప్పట్లను మార్చాలి

అలాగే ఒకరు ఉపయోగించిన దిండ్లు మరొకరు వాడకుండా జాగ్రత్తగా ఉండటమూ ముఖ్యమే. ఇలా చేస్తే మొటిమల సమస్య చాలావరకు దూరమవుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు

రాత్రి నిద్రించే ముందు ముఖంపై మేకప్‌ పూర్తిగా తొలగించుకోవాలి. లేదంటే చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలొచ్చేస్తాయి. అందుకే మేకప్‌ పూర్తిగా తొలగించుకోవాలి

రాత్రి పడుకునే ముందే జుట్టుకు నూనె పెట్టుకునే అలవాటు క్రమంగా మొటిమలకు దారితీస్తుందట. అందుకే పడుకునే ముందు ఈ అలవాటును మానుకోవడం బెటర్‌