మాటిమాటికీ ముఖం కడుగుతున్నారా?
1st August 2
023
Pic credit - Pexels
మాటిమాటికీ ముఖం కడుక్కోవడం వల్ల చర్మం శుభ్రపడుతుందని చాలామంది అనుకుంటారు
నిజానికి ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల తేమ కోల్పోయి పొడిబారుతుంది
తేమను కాపాడే సీబమ్ అనే నూనె పదార్థం తొలగిపోతే చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది
అందుకే రోజుకు రెండుమూడు సార్లకు మించి ముఖం కడుక్కోకపోవడం బెటర్
ముఖం శుభ్రతకు గాఢత తక్కువగా ఉండే సబ్బు లేదా లిక్విడ్ ఫేస్‌వాష్ ఎంచుకోవాలి
కొందరిది జిడ్డు చర్మమైతే, మరికొందరిది పొడిగా ఉంటుంది ఇంకొందరికి సాధారణ చర్మతత్వం కలిగి ఉంటారు
సాధారణ చర్మతత్వం గల వారు రోజులో ఒకటి లేదా రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే చాలు
జిడ్డు చర్మతత్వం ఉన్నవారు రెండుమూడుసార్లు, పొడి చర్మం ఉన్న వారైతే ఒకట్రెండుసార్లు ముఖం కడుక్కొని.. వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి
ఇక్కడ క్లిక్ చేయండి