అస్తమానం చిక్కులు పడిపోతుందా..? ఐతే ఇలా చేయండి

25 August 2023

ఎండ, వాన, మంచు, కాలుష్యం ఇలా కారణం ఏదైనా వాటి ప్రభావం తప్పనిసరిగా కురులపై పడుతుంది. ఫలితంగా జుట్టు నిర్జీవంగా మారుతుంది

జుట్టు గడ్డిలా మారి, జీవం కోల్పోవడం, అస్తమానం చిక్కులు పడిపోతుంటుంది. ఈ ఇబ్బందులు తొలగాలంటే వారానికోసారి ఇలా చేసి చూడండి

జుట్టుకి తగిన పోషణ అందక పోవడం వల్ల నిర్జీవంగా మారి కుదుళ్లు బలహీనపడి రాలి పోతుంది. కళ్ల ముందే అపురూపంగా చూసుకునే జుట్టు రాలిపోతుంటే మనసు చివుక్కుమంటుంది

జుట్టుకి పోషణ అందించడంలో పెరుగు, ఆముదం చక్కగా పని చేస్తుంది. అరకప్పు పెరుగుకు మూడు టేబుల్‌ స్పూన్ల ఆముదం కలిపి పేస్తులా తయారు చేసుకోవాలి

ఈ మిశ్రమాన్ని మాడు నుంచి కురుల చివర్ల వరకు తలంతా పట్టించాలి. ఆ తర్వాత అరగంట పాటు అలాగే ఉండనిచ్చి షాంపూతో తలస్నానం చెయ్యాలి

ఇలా వారానికోసారి చేస్తే మాడు పొడిబారడం అగిపోయి.. శిరోజాలకు కావాల్సిన తేమ అందుతుంది. చుండ్రు సమస్య కూడా అదుపులోకి వస్తాయి

అలాగే గుడ్డు తెల్లసొన కూడా పాడైపోయిన జుట్టుకు జీవం పోస్తుంది. ఒక కప్పుడలో గుడ్డు తెల్లసొన వేసి విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ రెండు వేసి బాగా కలుపుకోవాలి

ఈ మిశ్రమాన్ని తలకు పట్టింటి షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరి. ఈ హెయిర్‌  ప్యాక్‌ జుట్టుకి కావాల్సిన పోషణ పుష్కలంగా అందిస్తుంది