ముత్యమంత పసుపుతో మెరిసే ఛాయ..

27 August 2023

వంటల్లో పసుపు వేస్తే వంటకానికి మంచి రంగూ, రుచిని అందిచడమేకాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఐతే సౌందర్య పోషణకు కూడా పసుపు చేసే మేలు అంతాఇంతా కాదు

కొంత మంది ముఖంపై ముడతలు, మచ్చలూ, కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి. ఫలితంగా మూడు పదులు దాటకుండానే పెద్ద వయసువారిలా కనిపిస్తుంటారు

జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఆహార అలవాట్లు ఇలా కారణాలు ఏవైనా చిటికెడు పసుపుతో ఈ సమస్యలన్నీ పారదోలవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు

పసుపులో యాంటీఆక్సిడెంట్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. దీన్ని తేనె, గంధం పొడి, పెరుగు వంటి వాటితో ఫేస్‌ ప్యాక్‌గా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

రెండు స్పూన్ల గంధం పొడిలో కొన్ని పాలు పోసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఆరనివ్వాలి

అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా క్రమంగా తప్పకుండా చేస్తే ముఖంపై నల్ల మచ్చలు, వలయాలు తొలగిపోతాయి

ఎండలో తిరగడం వల్ల ముఖంపై ఏర్పటే నల్లటి ట్యాన్‌ తొలగించాలంటే.. పావు స్పూన్‌ పసుపు పొడిలో గులాబీ పొడి ఒక స్పూన్‌, పెసర పిండి ఒక స్పూన్‌ వేసి కలుపుకోవాలి

దీన్ని రోజ్‌ వాటర్‌తో పేస్ట్‌లా కలిపి ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే నలుపు ట్యాన్‌ తొలగి, చర్మఛాయ మెరుగుపడుతుంది