మగువల సొగసు రెట్టింపు చేసే కుంకుమ పువ్వు..

24 August 2023

కుంకుమ పువ్వులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో దీన్ని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు

కుంకుమ పువ్వులో చర్మసమస్యలకూ చెక్‌ పెట్టే ఔషధ గుణాలు కూడా నిండుగా ఉంటాయి. చర్మాన్ని మెరిసేలా చేసి ముఖ సౌందర్యాన్ని పెంచడంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది

దీనిలోని యాంటీ ఫంగల్‌ లక్షణాలు మొటిమలు తగ్గించి, మొటిమల తాలూకు మచ్చలను దూరం చేస్తుంది

స్పూన్‌ రోజ్‌ వాటర్‌లో రెండు రెండు కుంకుమపువ్వు రేకలు వేసి పావు గంట నాననివ్వాలి

బాగా నానిన తర్వాత ఆ ద్రవంలో పసుపు కలిపి మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించాలి

అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మం మృదువుగా మారడమే కాకుండా చర్మం తాజాగా ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. 

కప్పు రోజ్‌వాటర్‌లో కొన్ని కుంకుమపువ్వు రేకులను పావుగంట నానబెట్టి దాన్ని ముఖానికి టోనర్‌ ఉపయోగించవచ్చు

మేకప్‌ తొలగించిన తర్వాత ఈ ద్రవంతో దూదితో ముఖాన్ని మృదువుగా అద్దుకుంటే చర్మం సహజమెరుపు కోల్పోకుండా ఉంటుంది

పాలల్లో నాలుగు కుంకుమ పువ్వు రేకలను వేసి నానిన తర్వాత దూదితో ముఖంపై మృదువుగా మర్దనా చేస్తే ముఖానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది