కనుబొమ్మల్లో చుండ్రు సమస్య నివారించాలంటే..

16 November 2023

యుక్త వయసులోకి అడుగుపెట్టిన అమ్మాయిల్లో శారీరక మార్పులతో పాటు ముఖంపై వచ్చే మొటిమలు వారిని మరింత ఇబ్బంది కలవరపెడతాయి

8-18 ఏళ్ల వయసులో ముఖంపై మొటిమలు రావడం సహజమని నిపుణులు చెబుతున్నారు. టీనేజ్‌ దశలో శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులు రావడం వల్ల మొటిమలు వస్తుంటాయి

ఆండ్రోజన్‌ అనే లైంగిక హార్మోన్‌ అధికంగా ఉత్పత్తవుతుంది. ఇది చర్మం కింద ఉండే సీబంను ప్రేరేపించి చర్మంపై జిడ్డుదనం పెరిగేలా చేస్తుంది

ఈ జిడ్డుకి మృతకణాలు, వాతావరణంలోని ధుమ్మూ, ధూళి తోడవడంతో మొటిమలొస్తాయి. వీటివల్ల ముఖంపై మచ్చలు ఏర్పడి ఇబ్బంది కలిగిస్తాయి

టీనేజ్‌ రోజుకు రెండు మూడుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇందుకు కలబందతో తయారుచేసిన ఫేస్‌వాష్‌లను ఉపయోగించచ్చు

ఎండ వల్ల కూడా కొన్నిసార్లు మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మరచిపోకూడదు

గ్రీన్‌ టీలో కొద్దిగా తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. లేదంటే గ్రీన్‌ టీ పొడిని ఫేస్‌మాస్క్‌ల్లో ఉపయోగించినా ఫలితం ఉంటుంది

టీనేజ్‌ వయసులోకి అడుగుపెట్టిన తర్వాత వారానికోసారి ముఖాన్ని స్క్రబ్‌ చేసుకోవాలి. బ్రౌన్‌ షుగర్‌, కాఫీ పొడి, ఓట్‌మీల్‌, సముద్రపు ఉప్పు.. వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసుకున్న స్క్రబ్స్‌ మేలు చేస్తాయి