జుట్టు ఇలా దువ్వితే ఒత్తుగా పెరుగుతుంది..

10 October 2023

జుట్టు అధికంగా రాలిపోవడానికి దువ్వే విధానం కూడా ఓ కారణమే. మరైతే ఎలా దువ్వుకోవాలి అని ఆలోచిస్తున్నారా?

చాలా మంది జుట్టు ఎక్కువసార్లు దువ్వితే రాలుతుందని ఏదో అలా పైపైన దువ్వుకొని జడ వేసేసుకుంటుంటారు. కానీ ఇది నిజం కాదు

ఎలా పడితే అలా దువ్వకుండా కుదుళ్ల నుంచి చివర్ల దాకా నెమ్మదిగా దువ్వుకుంటే కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

సాధారణంగా మనం రోజూ సుమారు 50 నుంచి 100 వెంట్రుకల దాకా రాలిపోతుంటాయి. జుట్టు చిక్కలను నిదానంగా కాకుండా ఎలాపడితే అలాదువ్వితే ఇంకా అధికంగా రాలుతాయట

నిజానికి కుదుళ్లలో సహజసిద్ధమైన నూనెల్ని విడుదల చేసే సెబేషియస్‌ గ్రంథులుంటాయి. దువ్వెనతో దువ్వడం వల్ల అవి ప్రేరేపితమై అవసరమైన మొత్తంలో నూనెల్ని విడుదల చేస్తాయంటున్నారు నిపుణులు

అసలు రోజుకు ఎన్నిసార్లు దువ్వుకోవాలనే సందేహం కూడా చాలామందికి వస్తుంది. రోజుకు రెండుసార్లు దువ్వుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు

ఇలా చేయడం వల్ల కుదుళ్లు, జుట్టు తేమను కోల్పోకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. జుట్టు కూడా ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది

వెంట్రుకల్లో చిక్కులు తొలగించుకుంటూ పైనుంచి కింది వరకు నెమ్మదిగా దువ్వుకోవాలి. ఎక్కడైనా చిక్కులు కట్టినట్లు అనిపిస్తే వేళ్లతో వాటిని తొలగించుకోవాలి