సొగసైన కళ్లకు కాటుక పెడుతున్నారా?
14 November 2023
సొగసైన కళ్లకు కాటుక అద్దితే కళ్ల అందం రెట్టింపు అవుతుంది. అంతేకాదు కళ్ల ఆరోగ్యాన్నీ కూడా కాటుక సంరక్షిస్తుందని చాలా మందికి తెలియదు
కళ్లకు తేమను, చల్లదనాన్ని అందించడంలో కాటుక పాత్ర కీలకమైనది. కంటిలోకి చేరిన మలినాలను తొలగించడంలోనూ కాటుక సాయపడుతుంది
అయితే రసాయనాలతో చేసిన కాటుకను ఎప్పుడూ ఎంపిక చేసుకోకూడదు. సేంద్రియ రకాలను ఎంచుకుంటే అందంతోపాటు ఆరోగ్యం సొంతం అవుతుంది
సాధారణంగా సంప్రదాయ కాటుకను ఆముదంతో తయారు చేస్తుంటారు. ఆముదంలోని విటమిన్ ఇ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
ఆముదంలోని పోషకాలు కనురెప్పలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఆర్గానిక్ కాటుక పెట్టుకోవడం వల్ల కంటిపై ఏర్పడే ఒత్తిడినీ తగ్గించి కళ్లకు విశ్రాంతిని ఇస్తుంది
కాటుక తయారీలో ఉపయోగించే కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి మేకప్ కారణంగా కళ్లకు వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది
కంప్యూటర్ తెరను ఎక్కువగా చూడటం, సరిగా నిద్రపోకపోయినా కళ్లు ఎర్రబడటం, ఉబ్బడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలన్నింటికీ కాటుక మంచి పరిష్కారం
ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన కాటుకలో నెయ్యినీ ఉపయోగిస్తారు. ఇది కంటి కింద నల్లటి వలయాలు రాకుండా దూరం చేసి, కంటి కండరాలను దృఢంగానూ మారుస్తుంది.
Learn more
ఇక్కడ క్లిక్ చేయండి