29 January 2024
TV9 Telugu
సహజంగా అమ్మాయిలు అందంగా కనిపించాలని. తమ మొహం మెరిసిపోవాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా ప్రస్తుత యువత ఎక్కువగా ఫేషియల్స్ వైపు మక్కువ చూపిస్తున్నారు.
కానీ, ఫేషియల్స్ చేసుకోవడం వల్ల స్కిన్ కి హానికలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫేషియల్ క్రీమ్స్ లో ఉండే కెమికల్స్ లాంగ్ రన్ లో ముఖ సౌందర్యాన్ని డామేజ్ చేస్తాయి.
అయితే ఫేషియల్ లేకుండా మొహం మెరుస్తూ ఉండడానికి ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. మరి అవేవో ఒకసారి చూద్దాం
సహజ సిద్ధంగా గ్లో పొందడం కోసం గులాబీ ఆకులను గ్రైండ్ చేసి మొహానికి రాసుకున్నట్టయితే మొహం తేమగా ఉంటుంది. ఇది మొహానికి గులాబీ రంగును ఇస్తుంది.
మొహం పై రోజ్ వాటర్ ను స్ప్రే చేసుకుంటే కూడా చర్మాన్ని పొడి కాకుండా తేమగా ఉంచుతుంది. ఇలా ఉంచడం వల్ల చర్మం ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది ట్యాన్ ప్యాక్‌లా పనిచేస్తుంది.
మొహంపై బుగ్గల పై తేనె రాసుకుంటే కూడా మొహం స్మూత్ గా మెరుస్తూ కనిపిస్తుంది. పచ్చిపాలలో తేనెను కలిపి మొహానికి రాసుకుంటే మీ చర్మం బంగారంలా మెరిసేలా చేస్తుంది.
గోల్డెన్ ఫేషియల్ చేసుకుంటే ఎంతలా మీ మొహం మెరుస్తుందో..పచ్చిపాలు, తేనెను కలిపి ముఖానికి రాసుకుంటే కూడా అలాగే మెరుస్తుంది.
పంచదార.. కొబ్బరి నూనె.. కాఫీ పొడితో కలిపి ముఖానికి పట్టించి కాసేపు అలాగే ఉంచుకుని కాసేపటి తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం మీ ముఖం మెరిసే నిగారింపును సొంతం చేసుకుంటుంది.