హరివిల్లు లాంటి కనుబొమ్మలు (ఐబ్రోస్) కోరుకోని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరికి పలుచగా ఉండటం వల్ల అందవిహీనంగా కనిపిస్తాయి
ఐతే ఇంట్లోనే దొరికే ఈ పదార్ధాలతో కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా పెరిగే టిప్స్ చెబుతున్నారు సౌందర్య నిపుణులు. జుట్టుకి పెట్టే హెన్నాతో చక్కగా కనుబొమ్మలు పంచుకోవచ్చు
కనుబొమ్మలను సహజంగా ఒత్తుగా పెంచడంలో హెన్నా బాగా పని చేస్తుంది. స్పూన్ హెన్నా పొడిని ఒక కప్పులో తీసుకుని కొద్దిగా నిమ్మరసం అందులో వేసి బాగా కలుపుకోవాలి
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కనుబొమ్మలకు రాయాలి. అరగంట తర్వాత నీళ్లోతో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా క్రమంగా చేస్తుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది
ఆముదం లేదా కొబ్బరి నూనెలు సహజ మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. వీటిల్లో ప్రొటీన్లు, ఫ్యాటీయాసిడ్లు రక్తప్రసరణను మెరుగుపరిచి కనుబొమ్మల పెరుగుదలకు ఉపయోగపడతాయి
ఈ నూనెలను రోజూ రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు రాసుకుంటే కొద్ది రోజుల్లోనే నల్లని ఒత్తైన కనుబొమ్మలు మీ సొంతం అవుతాయి. ఈ రోజు నుంచే ట్రై చేయండి
ఆలివ్‌నూనె కూడా కనుబొమ్మలను పెరిగేలా చేస్తుంది. దీనిలోని విటమిన్ ఎ, ఇ కనుబొమ్మల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.
అలాగే కలబంద గుజ్జులో రెండు చుక్కలు కొబ్బరి నూనె వేసి రాసుకున్నా ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు రాసి అరగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి