చలికాలంలో చర్మ సంరక్షణ సవాలుతో కూడుకున్న పని. దీనికి తోడు దుమ్మూధూళీ, ఒత్తిడీ.. అందమైన చర్మానికి ఇవే ప్రధాన శత్రువులుగా మారుతాయి
శరీరాన్ని స్వెటర్లు, క్యాప్‌లతో కప్పేసినా చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం, పెదాలు, పాదాల పగుళ్లు, పొడిబారిన జుట్టు వంటి సమస్యలు వెంటాడుతాయి
ఇలాంటి సమస్యల నుంచి మన చర్మాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు
వాటిల్లో ముఖ్యమైనది ముఖానికి ఆవిరిపట్టడం. ఇది చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది.ఆవిరి వెచ్చదనం ముఖంపై పేరుకున్న మృతకణాలను సులువుగా తొలగిస్తుంది
మేకప్ కారణంగా చర్మంపై చేరిన బ్యాక్టీరియాను కూడా ఆవిరి వల్ల తొలగించవచ్చు. వేడినీళ్లలో నాణ్యమైన ఎసెన్షియల్ ఆయిల్స్ వేసి ఆవిరిపట్టితే మంచి ఫలితం ఉంటుంది
ఇలా ఆవిరి పట్టడం వల్ల ఒత్తిడీ తగ్గుడంతోపాటు చర్మమూ ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఆయితే ఆవిరి పట్టిన తర్వాత ఈ ముఖ్యమైన పని చేయడం మర్చిపోకూడదు
అదేంటంటే ఆవిరి పట్టిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలి. అలాగే నెలకి రెండుసార్లు మాత్రమే ఆవిరి పట్టుకోవాలి
పొడి, జిడ్డు చర్మతత్వం ఉన్న వారు కూడా ఏ మాత్రం బెరుకులేకుండా ముఖానికి ఆవిరిపట్టుకోవచ్చు. అయితే అలర్జీ, వాపు, యాక్నె ఉన్నవారు ఆవిరికి పట్టడం అంత సురక్షితం కాదు