ఇంట్లో మీరు వాడుతున్న ఈ వస్తువులు క్యాన్సర్ కారకాలు.. వీటితో జాగ్రత్త..

 22 April 2024

TV9 Telugu

Pic credit - Pixabay 

ఇంట్లో ఉపయోగిస్తున్న కొన్ని రకాల వస్తువులు కార్సినోజెన్లుగా మారుతున్నాయి. బెంజీన్, ఆస్బెస్టాస్, వినైల్ క్లోరైడ్, ట్రైక్లోరోఇథిలీన్ వంటి రకరకాల విష పదార్ధాలతో తయారుచేస్తారు. వీటితో క్యాన్సర్ బారినపడుతున్నారు. 

విష పదార్ధాలుగా 

ప్రస్తుతం నాన్ స్టిక్ కోటింగ్ పాత్రల్లో వంట చేస్తే హానికరమైన పెర్ఫ్లోరినేటెడ్ రసాయనాలను విడుదల చేస్తాయి. దీర్ఘకాలం వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.  

నాన్ స్టిక్ కోటింగ్ పాత్రలు

రోజు రోజుకీ ప్లాస్టిక్ డబ్బాలు వాడే వారి సంఖ్య ఎక్కువే.. వీటిల్లో బిస్ఫెనాల్ ఎ (బిపిఎ), థాలేట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా మారతాయి. 

ప్లాస్టిక్ వస్తువులు 

ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్న క్లీనర్స్ లో ఫార్మాల్డిహైడ్, అమ్మోనియా, క్లోరిన్ బ్లీచ్ వంటి రసాయనాలుంటాయి. ఇవి కూడా క్యాన్సర్ కారకాలుగా మారతాయి

ఫ్లోర్ క్లీనర్ 

ఎలక్ట్రానిక్స్ వస్తువులు నుంచి వై-ఫై రౌటర్ల వరకు విద్యుదయస్కాంత రేడియేషన్ ను విడుదల చేస్తాయి. ఇవి రిలీజ్ చేసే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంది

సెల్ టవర్స్, వై-ఫై రౌటర్లు 

ప్రస్తుతం ఇంట్లో సువాసనలను వెదజల్లే కొవ్వొత్తులను ఉపయోగిస్తున్నారు. ఇవి టోల్యూన్, బెంజీన్ వంటి రసాయనాలును వెదజల్లుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా మారతాయి. 

సెంటెడ్ క్యాండిల్స్

ఇంటి అందం కోసం ఉపయోగిస్తున్న కొన్ని రకాల పెయింట్స్, వార్నిష్ వంటివాటిల్లో బెంజీన్, టోల్యూన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. ఈ పరిసరాల్లోని గాలిని పీల్చడంతో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు

పెయింట్స్, వార్నిష్