అరటి పండుతోనే కాదు.. పువ్వుతోనూ ఆరోగ్యానికి మేలు.. ఆ సమస్యలన్నీ ఖతం..
Prudvi Battula
Images: Pinterest
20 November 2025
ఆరోగ్యాన్ని కాపాడడంలో అరటి పండు ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే పండుతోనే కాదు.. అరటి పువ్వుతో కూడా అద్భుత ప్రయోజాలను పొందవచ్చు.
అరటి పండు
అరటి పువ్వులో ఉండే మినరల్స్ గురించి చెప్పుకోవాలంటే దీని నుంచి కాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఐరన్ వంటివి ఉంటాయి.
అరటి పువ్వు
అరటి పువ్వులో పోషక విలువలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పువ్వులను సలాడ్లు, సూప్‌గా తీసుకుంటుంటారు.
సలాడ్లు, సూప్
అరటిపువ్వులోని ఔషధ లక్షణాలు మధుమేహాన్ని నియంత్రిండంలో ఉపయోగకరంగా ఉంటాయి. శరీరంలోని గ్లూకోజ్‌ను పెంచడంతో పాటు ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్
అరటి పువ్వు క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో ఉపయోగపడుతుంది. ఇందులో ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.
క్యాన్సర్, గుండె జబ్బుల నివారణ
అరటి పువ్వులో పుష్కలంగా ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపచేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అరటి పువ్వులో ఉండే అనేక పోషకాలు మూత్రపిండాల ఆరోగ్యకరమైన పనితీరును ప్రేరేపిస్తాయి. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించి ఉబ్బరం, మూత్ర సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఉబ్బరం, మూత్ర సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది
అరటి పువ్వులలో ఐరన్ సమృద్ధిగా దొరుకుతుంది. తద్వారా రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకుంటే ఎర్ర రక్త కణాల స్థాయి పెరుగుతుంది.