సాధారణంగా ముఖంపైనే మొటిమలు వస్తుంటాయని చాలా మంది అనుకుంటారు. అయితే కొంతమందికి ఛాతీపై, వీపు భాగంలో కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది
అయితే జీవనశైలిలో మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఇలా మొటిమలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిద్దాం
పొడిబారిపోయిన చర్మానికి తేమనందించడానికి ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ రాసుకుంటే.. ఈ జిడ్డుదనం, దుమ్ము-ధూళి, బ్యాక్టీరియా వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి, క్రమంగా మొటిమలకు దారి తీస్తుంది
వ్యాయామం చేసే క్రమంలో బిగుతైన దుస్తులు ధరించడం, ఈ క్రమంలో చెమటతో దుస్తులు రాపిడికి గురైనా సమస్య తలెత్త వచ్చంటున్నారు నిపుణులు
ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల మొటిమల సమస్య ఎదురవుతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ బారిన పడినా మొటిమలొస్తాయి
ఒత్తిడి, ఆందోళనలు ఎదురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయులు పెరిగి మొటిమలొస్తాయి. వీటిని నివారించాలంటే ఛాతీ, వీపు భాగంలో చర్మం ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి
ఈ సమస్య ఉన్న వారు నూనె ఆధారిత సన్‌స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజర్లు వాడకపోవడమే మంచిది. జింక్ ఉపయోగించి తయారుచేసిన క్రీమ్‌లు, లోషన్ల వల్ల కూడా కొంతవరకు ఫలితం ఉండచ్చు
నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆయా భాగాల్లో ఉన్న మొటిమల సమస్యను తగ్గించుకోవడానికి టీట్రీ నూనె ఆధారిత జెల్‌లు, బాడీ వాష్‌లు ఉపయోగించాలి