చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెరను తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జ్యూస్‌లు, మిల్క్ షేక్స్‌లో అధికంగా ఉండే చక్కెరతో చర్మం ముడతలు పడుతుంది.
చీజ్, ఐస్‌క్రీమ్ వంటివి కూడా చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మెటిమలు రావడం, చర్మం ముడతలు వంటి సమస్యలు వస్తాయి.
జంక్ ఫుడ్ తీసుకున్న చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, చిప్స్ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఉప్పు ఎక్కువగా తీసుకున్నా చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పును మితంగానే తీసుకోవాలి.
తీసుకునే నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. క్లోరి, ఫ్లోరైడ్ ఉండే నీటితో చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది.
సోడా, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అధికంగా ఉండే చక్కెర చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.