కిడ్నీ స్టోన్స్ వారు ఉప్పును వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రెడ్‌మీట్‌కు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి మూత్రంలో యూరిక్ యాసిడ్ లెలెల్స్‌ను పెంచుతాయి. దీంతో ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుంది.
ఆల్కహాల్ సేవిస్తే రాళ్లు తొలగిపోతాయనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రాళ్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ జాతికి చెందిన పండ్లు ఆరోగ్యానికి మంచివని తెలిసిందే. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి మాత్రం ఇవి మంచివి కావని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారు సోడాకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. సోడాలో ఉండే.. ఫాస్బారిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుందని అంటున్నారు.
నిత్యం కూల్ డ్రింక్స్‌ను సేవించే వారిలో కూడా కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫాస్పోరిక్ యాసిడ్ రాళ్ల సమస్య పెరగడానికి కారణమవుతుంది.
కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవ్వాలంటే శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కచ్చితంగా రోజూ మూడు లీటర్ల నీటిని తీసుకోవాలని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.