మీరూ ఫేస్ ప్యాక్‌ వేస్తున్నారా... ఈ తప్పులు చేయకండి

24 December 2023

ముగువలకు అందంపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఏకాస్త సమయం దొరికిగిన అందంపై దృష్టి సారిస్తుంటారు. అందుకు రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు

వీలైతే పార్లర్‌కి వెళ్లడం లేకుంటే ఇంట్లో ఏదో ఒక ఫేస్‌ప్యాక్‌ ట్రే చేస్తుంటారు. కానీ ఇది మంచిదే గానీ ఇలా ప్యాక్‌లు వేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి

కొంతమంది అదేపనిగా ఫేస్‌ప్యాక్‌లు వేస్తుంటారు. ఇది అంత మంచిది కాదంటున్నారు సౌందర్య నిపుణులు. ఇలా పదేపదే వేయడం వల్ల చర్మం పొడిబారుతుందట

కొన్ని ప్యాకుల్లో హానికారక రసాయనాలు కూడా ఉంటాయి. అవి కూడా చర్మానికి హాని కలిగిస్తాయంటున్నారు. ఫేస్‌ప్యాక్‌ వేసుకునేటప్పుడు ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

కొంతమంది ఫేస్‌ ప్యాక్‌ ముఖంపై ఎంత ఎక్కువ సేపు ఉంచుకుంటే అంత అందం అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. ఇలా ఎక్కువసేపు ఉంచడంవల్ల చర్మంపై సహజ నూనెల్ని కోల్పోతాం

అంతేకాకుండా ముఖం మరీ పొడిబారిపోయి అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే ఫేస్‌ ప్యాక్‌ ఆరిన వెంటనే శుభ్రం చేసుకోవడం మంచి పద్ధతి అంటున్నారు నిపుణులు

ఏదైనా కొత్తరకం ఫేస్‌ప్యాక్‌ని ప్రయత్నించేటప్పుడు ప్యాచ్‌ టెస్ట్‌ని కచ్చితంగా చేసుకోవాలట. చెవి వెనుక లేదా అరచేతి వెనక కానీ ప్యాచ్‌ టెస్ట్‌ వేశాకే ఫేస్‌ప్యాక్‌ని ప్రయత్నించండి

కొంతమంది ముఖం శుభ్రం చేయకుండా ఫేస్‌ప్యాక్‌ని నేరుగా వేసుకుంటారు. ఇలా చేయటం వల్ల ప్యాక్‌లోని పోషకాలు చర్మంలోకి వెళ్లవు. తద్వారా ఫేస్‌ప్యాక్‌ వేసినా ప్రయోజనం ఉండదు