తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా.. ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది

01 March 2024

TV9 Telugu

Pic credit - Pexels

ఆరోగ్యం ఆహారానికి అవినావభావ సంబంధం ఉంది. కనుక పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా కొన్ని నియమాలను గుర్తుపెట్టుకోవాలి 

ఆరోగ్య సంరక్షణ

అయితే చాలా మంది ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణాశయం పని తీరుపై ప్రభావం చూపిస్తుంది. దీని వలన ఆహారం జీర్ణం కాదు. శరీరానికి పోషకాలు అందవు.

తిన్న తర్వాత నీరు

పండ్లను తినడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అయితే రాత్రి భోజనం తిన్న వెంటనే పండ్లు తింటే జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి. ఇది కడుపు నొప్పి,  ఉబ్బరం కలుగుతుంది. 

రాత్రి భోజనం తర్వాత పండ్లు

ఆహారం తిన్న వెంటనే స్వీట్లు తినే అలవాటు ఉన్నవారిని ఊబకాయం వైపు నెట్టివేస్తుంది. అంతేకాదు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. 

స్వీట్లు తినవద్దు 

ఆహారం తిన్న తర్వాత పొరపాటున కూడా ఎక్కువ శ్రమ కలిగిన వ్యాయామం లేదా యోగా చేయకూడదు. ఇది ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది

వ్యాయామం, యోగా 

భోజనం తర్వాత టీ, కాఫీలు తీసుకునే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఈ అలవాటు ఎసిడిటీ సమస్యను పెంచుతుంది.  ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు టీ, కాఫీలు తీసుకోవద్దు. 

టీ లేదా కాఫీ తీసుకోవద్దు

ఆహారం తిన్న వెంటనే హాయిగా నిద్రపోవడం లేదా ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. శరీరానికి తగిన పోషకాలు  అందవు.

వెంటనే నిద్ర పోవద్దు 

ఆహారం తిన్న తర్వాత, 10 నుండి 15 నిమిషాల నడక లేదా వజ్రాసనంలో కూర్చోండి. అంతేకాదు నీరు త్రాగడానికి 30 నిమిషాలు గ్యాప్ తీసుకోవడం మంచిది.

ఏది సరైన పని అంటే..