శరీరంలో ఈ పార్ట్‌లపై పెర్ఫ్యూమ్ స్ప్రే వద్దు..

09 October 2024

TV9 Telugu

TV9 Telugu

మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత ఫ్యాషన్‌ అభిరుచులు కూడా మారుతున్నాయి. ట్రెండీ డ్రెస్సింగ్‌తోపాటు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా నచ్చిన పెర్‌ఫ్యూమ్ లేకుండా బయట అడుగుపెట్టే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదు

TV9 Telugu

అయితే పెర్‌ఫ్యూమ్ వేసుకోవడమే కాదు.. దాన్ని ఎంచుకోవడం కూడా ఒక నైపుణ్యమే అంటున్నారు నిపుణులు. నిజానికి, పెర్‌ఫ్యూమ్స్‌ని వాడే సంప్రదాయం మొదట స్త్రీలతోనే ప్రారంభమైందట 

TV9 Telugu

తొలినాళ్లలో వీటిని వివిధ పువ్వులతో తయారు చేసేవారు. నేటి కాలంలో రకరకాల రసాయనాలతో వీటిని తయారు చేస్తున్నారు. చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఆహ్లాదకరమైన భావనలతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి

TV9 Telugu

పెర్‌ఫ్యూమ్‌లో వివిధ రకాల పరిమళాలు ఉంటాయి. ఆయా సువాసనలను బట్టి వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎంచుకునే పరిమళం మనసుకి ప్రశాంతతను చేకూర్చేలా, దాని గాఢత ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చూసుకోవాలి

TV9 Telugu

అయితే ఈ మధ్య కాలంలో పెర్ఫ్యూమ్ వాడకం ఫ్యాషన్‌గా మారింది. ఇప్పటికే మార్కెట్లో చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. దేశవిదేశాల్లో రకరకాల బ్రాండ్‌లు ప్రాచుర్యం పొందాయి

TV9 Telugu

మన దేశంలో పెర్ఫ్యూమ్ గంధం, మల్లె, గులాబీ, కుంకుమపువ్వు వంటి సహజ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తున్నప్పటికీ.. కొందరు వ్యాపారులు అధిక లభాలకు అలవాటుపడి రసాయనాలతోనూ వీటిని తయారు చేస్తున్నారు

TV9 Telugu

ఇలాంటి వాటిని వినియోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శరీరంలో కొన్ని భాగాలపై అస్సలు వీటిని స్ర్పే చేయకూడదట. కళ్ల చుట్టూ ఉన్న చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకే కళ్ల చుట్టూ పెర్ఫ్యూమ్ వాడకూడదు

TV9 Telugu

అలాగే చంకలకు పెర్ఫ్యూమ్ స్ర్పే చేయకూడదు. ఇది ఆ ప్రాంతాన్ని నల్లగా మార్చడమే కాకుండా అలర్జీని కూడా కలిగిస్తుంది. వీలైనంత వరకు చెవి చుట్టూ అప్లై చేయడం మానుకోవాలి. ఇందులోని రసాయనాలు చెవి లోపల చర్మాన్ని తేలిగ్గా దెబ్బతీస్తాయి