డ్రైవింగ్‌ చేయాలంటే భయపడుతున్నారా? ఈ టిప్స్​తో దూసుకెళ్లండి!

15 November 2023

అమాక్సోఫోబియా ఉన్నవారు అసలు డ్రైవింగ్ జోలికే వెళ్లరు. డ్రైవింగ్ భయం మహిళలకు మాత్రమే కాదు. పురుషులకు కూడా ఉంటుంది.

అయితే.. డ్రైవింగ్​ సమయంలో మీరు భయపడుతుంటే గనక.. కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. తద్వారా.. మీ భయాన్ని మర్చిపోయి రైడ్​ను ఎంజాయ్​ చేయొచ్చు.

నిత్యం డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తే.. మీ డ్రైవింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. అప్పుడు ఆటోమేటిగ్గా.. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు.

నెమ్మదిగా డ్రైవ్ చేయండి. మీకు నమ్మకం వచ్చేంత వరకూ వేగం పెంచకండి. డ్రైవింగ్ చేసే ముందు వ్యాయామం చేయండి. దీనివల్ల డ్రైవింగ్ పట్ల మీకున్న భయాన్ని అధిగమించవచ్చు.

"నాకు డ్రైవింగ్ రాదు.. నేను డ్రైవింగ్ చేయలేను" అనే నెగెటివ్ థాట్​ను మనసులోంచి తీసేయండి. అందుకు తగిన విధంగా సాధన చేస్తే.. ఏదైనా సాధ్యమే అనే విషయాన్ని నమ్మండి.

"లక్షలాది మంది డ్రైవ్ చేస్తుంటే.. నేనెందుకు చేయలేను?" అనే ఆలోచనా విధానం ద్వారా.. సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి.

డ్రైవింగ్ ఇన్​స్ట్రక్షన్స్ అన్నీ తెలిసిన తర్వాత మాత్రమే మీరు ఒంటరిగా వాహనాన్ని నడపడానికి ప్రయత్నించండి.

అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు ఏకంగా బుజ్జగింపుల కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.