బూడిద గుమ్మడికాయను నేరుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.
షుగర్ సమస్యతో బాధపడేవారికి కూడా బూడిద గుమ్మడికాయ రసం బాగా సహాయపడుతుంది. ఇదిల రక్తంలోని చక్కెరని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే బూడిద గుమ్మడి కాయ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
డీహైడ్రేషన్ సమస్యను దూరం చేయడంలో కూడా బూడిద గుమ్మడ కాయ ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌ను తీసుకుంటే శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉంటుంది.
మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉన్న వారు, మూత్రంలో మంట ఉంటే కూడా బూడిద గుమ్మడి కాయ జ్యూస్ ఎంతో క్రీయాశీలకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సంబంధిత సమస్యలు రావొద్దన్నా, పేగులు శుభ్రంగా ఉండాలన్నా బూడిద గుమ్మడి కాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.