బలాన్నీ ఆరోగ్యాన్నీ ఇచ్చే బూడిద గుమ్మడి.. తింటున్నారా?

March 10, 2024

TV9 Telugu

బూడిదగుమ్మడికాయ.. ఈ పేరు తెలియని తెలుగువాడు ఇండడు. కొందరు దీన్ని దిష్టికి గుమ్మానికి కడితే.. మరి ఇంకొందరేమో దీనితో వడియాలు పెట్టి ఆరగిస్తారు

బూడిద గుమ్మడితో అంతకుమించి ఏం ప్రయోజనాలు ఉంటాయిలే అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో ఎన్నో పోషకాలు, మరెన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మరి

ముఖ్యంగా బూడిదగుమ్మడిలో పీచు, జింక్‌, క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, సి-విటమిన్‌, ప్రొటీన్లు వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

అంతేకాకుండా ఇది శరీరంలో మేలుచేసే బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. అల్సర్లకు ఔషధంలా పనిచేస్తుంది. శ్వాస ఇబ్బందులను కూడా వదలగొడుతుంది

మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధక సమస్య తలెత్తకుండా నివారిస్తుంది. బరువు పెరగకుండా కాపాడుతుంది

బూడిద గుమ్మడి ఆహారంలో తింటే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. హానికారక టాక్సిన్లను నిరోధించి.. చర్మాన్ని సంరక్షిస్తుంది

రక్తపోటును కూడా క్రమబద్ధం చేస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు తలెత్తకుండా చేస్తుంది. ఇది జలుబు, జ్వరం, దగ్గు వంటి సాధారణ సమస్యల నుంచి డిప్రెషన్‌, క్యాన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధుల వరకు ఉపశమనం కలిగిస్తుంది

బూడిదగుమ్మడి రసంలో చెంచా నెయ్యి కలిపి తాగితే స్వర ఇబ్బందులు పోయి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వీటి గింజల పొడిని నూనెలో మరిగించి తలకు రాసుకుంటే చుండ్రు, తలనొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి