ప్రతి రోజు ఏసీ వాడుతున్నారా ?? అయితే జాగ్రత్తలు తప్పనిసరి

TV9 Telugu

05 June 2024

ఎండాకాలం వచ్చిందంటే బయట వేడి తట్టకోలేక ఏసీను అధికంగా వాడుతుంటారు. అయితే ఏసీను సరైన పద్దతి లో వాడాలి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక వేడి కారణంగా ఏసీని ఉపయోగిస్తారు. తద్వారా చల్లదనంతో పాటు వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది.

ఉదయం కూడా ఎక్కువ సమయం ఏసీని వాడుతుంటారు. అయితే ఇలా రోజంతా ఏసీని వాడటం వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజులో ఏసీ 10 నుంచి 14 గంటలు మాత్రమే వాడాలి. అంతకు మించి ఎక్కువ సేపు దానిని వాడితే అది పాడయ్యే అవకాశం ఉంది.

సాధారణంగా ఏ యంత్రానికైనా విశ్రాంతి అవసరం.. లేకపోతే అది వేగంగా పాడవుతుంది. ఏసీని కొంత సమయం వినియోగం తరువాత కొంత సమయం విశ్రాంతి ఇవ్వాలి.

ఇలా చేయడం ద్వారా ఏసీ పై ఒత్తిడి తగ్గించవచ్చు.. కరెంట్ వినియోగాన్ని తగ్గించవచ్చు..  అంతే కాకుండా ఎక్కువ కాలం పాడవకుండా పని చేస్తుంది.

అందుకే ప్రతి రోజు ఏసీని వాడే వారు 14 గంటల లోపు మాత్రమే వాడాలని చెపుతున్నారు నిపుణులు. ఏసీ పై  వత్తిడి తగ్గి ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తుంది.