చలిలో అధిక సమయం ఉంటున్నారా.? ఇక అంతే సంగతులు.. రిస్కులో పడినట్టే..
Prudvi Battula
Images: Pinterest
19 November 2025
చలిలో ఎక్కువసేపు గడపడం వల్ల శరీరంలో షాకింగ్ మార్పులు చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
చలిలో ఎక్కువసేపు గడపడం
అతి చల్లని వాతావరణంలోకి వెళ్లినప్పుడు శరీరం అల్పోష్ణస్థితికి తొందరగా గురవుతుందని అంటున్నారు నిపుణులు.
శరీరం అల్పోష్ణస్థితికి
చలిని అధిగమించేందుకు శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పడిపోయి వణుకు, గందరగోళం, అపస్మారక స్థితికి దారితీస్తుంది.
వణుకు, గందరగోళం
శరీరంలో బహిర్గతమయ్యే భాగాలపై చలి ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ముఖ్యంగా ముఖం, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, రంగు మారడం, కణజాలం చనిపోవడం జరుగుతుంది.
కణజాలం చనిపోవడం
చల్లగా ఉన్న పొడి గాలులు పీల్చుకోవడం వల్ల గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. శ్వాసకోశ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది.
శ్వాసకోశ వ్యవస్థపై ఎఫెక్ట్
ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నవారికి ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ రోజులు ఇలాంటి వాతావరణానికి గురయితే సమస్య తీవ్రత పెరుగుతుంది.
ఆస్తమా
విపరీతమైన చలి హృదయనాళ వ్యవస్థపై ఎక్కువ భారం పడేలా చేస్తుంది. శరీరం ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమ తీసుకుంటుంది.
హృదయనాళ వ్యవస్థపై ఎక్కువ భారం
ఇది గుండె కొట్టుకునే వేగానికి, అధిక రక్తపోటుకు దారితోస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది.