చాలా మంది సాక్స్ ధరించి రాత్రుళ్లు నిద్రపోతుంటారు. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే, ఈ అలవాటు ప్రమాదకర వ్యాధుల బారీన పడేలా చేస్తుంది
సాక్స్‌లలో కంటికి కనిపించని చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని ఇటీవలి పలు పరిశోధనలు వెల్లడించాయి
అపరిశుభ్రమైన సాక్స్‌లతో రాత్రి పడకపై పడుకోవడం వల్ల మంచానికి హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.
చాలా మంది షూ ధరించిన తర్వాత వ్యాయామం, ఇతర రోజువారీ కార్యకలాపాలు చేసే ప్రతిసారీ ఒకే విధమైన సాక్స్‌లను ధరిస్తారు
ఇలా అన్ని చోట్లకు ఒకే సాక్స్ ధరించి వెళ్లడం వల్ల కంటికి కనిపించని బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది. ఇది అంతర్గత అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ బ్యాక్టీరియా మరింత ప్రమాదకరని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. క్యాన్సర్ రోగులు, మధుమేహ రోగులు, సిస్టిక్ ఫైబ్రోసిస్ రోగులు, చిన్న పిల్లలు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు సాక్స్ ధరించి ఎట్టిపరిస్థితుల్లో నిద్రపోకూడదు.
కొంతమందికి నిద్రపోయేటప్పుడు శరీరానికి చెమటలు పడతాయి. ఇలాంటి వారి శరీరంపై బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెంది పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.