లివ్‌-ఇన్‌లో ఉంటున్నారా.? ఇవి తెలుసుకోవాల్సిందే.. 

08 July 2025

Prudvi Battula 

లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్ అనేది ఈ కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు వారి ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే భార్యభర్తలుగా కలిసి జీవిస్తారు.

మీ బంధం విచ్ఛిన్నం కావడానికి ఇది కూడా ఒక కారణమని మీకు తెలుసా? లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ కామన్ కదా.. అలా ఉంటే ఏం నష్టం జరుగుతుంది?

ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు ఒకరి అలవాట్లు, జీవనశైలి గురించి మరొకరు తెలుసుకుంటారు. ఇది వారి భవిష్యత్తులో కలిసి జీవించడంలో సహాపడుతుంది.

ఒత్తిడి లేదా సంతోష సమయంలో ఒకరికొకరు భౌతికంగా ఉండటం వల్ల మానసిక బంధం పెరుగుతుంది. లివ్-ఇన్‌లో స్వేచ్ఛ ఎక్కువ, సులభంగా విడిపోవచ్చు.

లివ్‌-ఇన్‌లో ప్రయోజనాలకంటే ప్రతికూలతలే ఎక్కువ. వివాహం లేకుండా కలిసి జీవించడం ద్వారా అభద్రతతో ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగదు.

పార్టనర్‌తో చిన్న విషయాలకు గొడవ పడినా దూరం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. అలా కొంచెం దూరం అయినా ఈ బంధం తెగిపోతుంది.

లివ్‌-ఇన్‌లో ఉన్న జంటలకు చట్టపరమైన హక్కులు, రక్షణ తక్కువుగా ఉంటుంది. ఇది ఆస్తి హక్కులు, వారసత్వంపై ప్రభావం చూపిస్తుంది.

లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్‎లో ఒక్కోసారి వ్యక్తుల మధ్య మనస్పర్థలకు దారి తీసి జంటలు విడిపోవడానికి కారణం అవుతుంది.