06 September 2023

క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

బ్యాడ్‌ మూడ్‌ నుంచి బయట పడటానికి, సాయంకాలం రిలాక్స్‌  కావడానికి చాలా మంది సువాసన వచ్చే క్యాండిల్స్‌ వెలిగిస్తారు, క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ను ఇష్టపడుతుంటారు.

అయితే క్యాండిల్స్‌ను వెలిగించే ముందు ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.

ముఖ్యంగా ఆస్థమా పేషంట్లు క్యాండిల్స్‌ పట్ల మరింత కేర్‌ తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే సాధారణ మనుషుల కంటే ఎక్కువగా అస్థమా పేషెంట్లపై క్యాండిల్స్‌ ఎక్కువగా ఎఫెక్ట్‌ చూపుతాయట.

కొవ్వొత్తులు వెలిగించినప్పుడు, ఆహార పదార్థాలు క్యాండిల్స్‌ మంటమీద వేడి చేసినప్పుడు వచ్చే పొగతో అక్కడి వాతావరణం పొల్యూట్‌ అవుతుంది. దాని మూలంగా ఆస్థమా బాధితుల్లో చిరాకుకు దారి తీస్తుంది.

అంతేకాకుండా ఆస్థమా బాధితుల్లోని రక్తనాళాలు వాపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఇటీవల నిర్వహించిన ఆర్హస్‌ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా డీఎన్‌ఏపై కూడా ఎఫెక్ట్‌ పడుతున్న సంకేతాలను గుర్తించారట.

కొవ్వొత్తులు వెలిగించినప్పుడు వెలువడే అతి సూక్ష్మ రేణువులు అక్కడక్కడే తిరుగుతూ ఊపిరి తీసుకున్నప్పుఉడు శరీరంలోకి చొచ్చుకెళ్లి ఆరోగ్యంపై ఎఫెక్ట్‌ పడుతుంది. 

ముఖ్యంగా స్వల్ప ఆస్థమా లక్షణాలు కలిగిన యూత్‌ మీద కూడా ఎఫెక్ట్‌  తీవ్రంగానే ఉంటుందంటున్నారు వైద్యులు. ట్లో గాలి కలుషితం కాకుండా చూసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం అని చెబుతున్నారు.

క్యాండిల్‌ వెలిగించినప్పుడు ఇంట్లోకి గాలి రావడానికి తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆస్థమా తగ్గటానికే కాదు.. గుండె, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్ల ముప్పులు దరి చేరవని వైద్యులు సూచిస్తున్నారు.