వీటిని అప్లై చేసారంటే.. మీ పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి.. 

29 September 2025

Prudvi Battula 

కొబ్బరి నూనె, తేనె, పంచదార కలిపి స్క్రబ్‌గా తయారుచేసుకొని పెదవులపై అప్లై చేస్తే గులాబీ రంగులోకి మారుతాయి.

తరుచూ ఇలా చేస్తే పెదవులపై చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. దీనివల్ల పెదాలను మృదువుగా మరి, మంచి రంగులోకి వస్తాయి.

రెగ్యులర్‌గా లిప్‌స్టిక్‌ వాడే వాళ్ల పెదాలు నల్లగా మారకుండా బయటి నుంచి రాగానే ఆలివ్‌ ఆయిల్‌ లేదా బాదం ఆయిల్‌తో లిప్‌స్టిక్‌ను తొలగించండి.

విటమిన్ ఈ టాబ్లెట్స్ పెదవులకు మంచి రెమెడీ. ఇవి పెదాలు అప్లై చేయడం వల్ల మృదువుగా, గులాబీ రంగులోకి మారతాయి.

పెదవులు పగిలి బాధ పెడుతుంటేనేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి.

స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి.

మీ పెదవులు మృదువుగా మంచి రంగులోకి రావాలంటే తరుచూ పెరుగు అప్లై చేస్తే చాలు. దీనివల్ల గులాబీగా మారుతాయి.

నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారడానికి మంచి రెమెడీస్.