రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నారా..? జాగ్రత్త..
Jyothi Gadda
23 July 2024
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతామని కొంతమంది తాగుతుంటారు. అయితే, ఇలా తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా ?
తరచూ యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయులు తగ్గుతాయి. గుండె లయ తప్పడం, అలసట, మూత్రపిండాల సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయట.
యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ స్థాయులను పెంచుతుంది. కొందరిలో గుండెల్లో మంటగా ఉండటం, వికారం, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
కొంతమందిలో, యాపిల్ సైడర్ వెనిగర్ అతిసారానికి కారణమవుతుంది. ఇంకా కడుపునొప్పి, ఎముకలు బలహీనంగా మారి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్‌లోని ఆమ్లాలు ఎనామిల్‌ని దెబ్బతీస్తాయి. అలాగే నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తాయి. ఇది క్రమంగా దంత క్షయానికి దారితీస్తుంది. దీనివల్ల దంతాలు దెబ్బతింటాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మ సహజ పీహెచ్ స్థాయులను మార్చగలదు. అలాగే ఇది స్కిన్ నుంచి సహజ నూనెలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. ఇంకా కొందరిలో దద్దర్లు, అలర్జీ ఏర్పడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. దీనివల్ల చర్మం సెన్సిటివ్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, సున్నితమైన చర్మం ఉన్నవారు నిపుణులను సంప్రదించి ఉపయోగించాలి.
చివరిగా యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ.. దీనివల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి. కాబట్టి, మీరు దీనిని ఏ విధంగానైనా తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.