శ్రీవారి భక్తులకు ఏపీ పర్యాటకశాఖ గుడ్‌న్యూస్..
TV9 Telugu
01 August 2024
విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తిరుమల వెళ్లేందుకు భక్తులకు ఏపీ పర్యాటకశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.
తక్కువ ధరలోనే తిరుమల దర్శనం చేసుకొనేలా తిరుపతికి ప్రతిరోజూ స్పెషల్ టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది.
రెండు రోజులు కొనసాగనున్న ఈ టూర్ ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి మొదలవుతుంది.
ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులు బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పిల్లర్ నెంబర్ 4 దగ్గర ఏపీటీడీసీకి హాల్ట్ వద్దకు రావాల్సి ఉంటుంది.
ఈ టూర్ బస్సు తెల్లవారుజామున ఉదయం ఆరు గంటలకు తిరుమల కొండకు చేరుకుంటుంది. భక్తులకు కొండపై వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు.
తిరుమల కొండపై ఫ్రెష్ అయ్యి ఉదయం టిఫిన్ పూర్తి చేసుకొని పదిగంటల సమయంలో శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
ఆ తర్వాత భోజనం చేసి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని తిరుపతికి చేరుకొని గోవిందరాజా దర్శనం చేసుకుంటారు.
అదే రోజు రాత్రి భోజనం తర్వాత తిరుగు ప్రయాణం మొదలై మరుసటిరోజు ఉదయం విజయవాడ చేరుకుంటారు. ఈ టూర్ ధర పెద్దలకు రూ. 3,970, పిల్లలకు రూ.3,670.
ఇక్కడ క్లిక్ చెయ్యండి