కొంతమందికి చిన్నతనంలోనే ముఖంపై ముడతలు ఏర్పడి వయసుకు మించి పెద్ద వారిగా కనిపిస్తుంటారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు రాసుకుంటూ ఉంటారు
ఫలితంగా సమస్య తగ్గకపోగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరికి చేరకుండా సహజంగా నివరించవచ్చు
బ్లూబెర్రీ పండ్లు చర్మ సౌందర్యానికి ఉపయోగపడే పాలీఫినోల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి కొత్త చర్మకణాలను ఉత్పత్తికి సహాయపడతాయి
సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించడంలో టమాటాల్లో ఉండే లైకోపీన్ ఉపయోగపడుతుంది. రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి
టమాటాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. ఫలితంగా చర్మానికి సహజ మెరుపు వస్తుంది
చర్మ సంరక్షణలో తేనె పాత్ర కీలకం. తేనెలో ఉండే యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది
ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం లోపల, బయటి నుంచి కూడా నవయవ్వనంగా ఉంటుంది
చర్మంపై దద్దుర్లు రావడం, ఎర్రగా మారడం వంటి సమస్యలను తగ్గించడంలో పెరుగులోని ప్రొబయోటిక్స్ తోడ్పడతాయి. అందువల్లనే పెరుగును రోజూ తీసుకోవాలి