అంజీరాతో.. లాభాలన్నీ ఇన్నీ కావు
Narender Vaitla
29 November
2024
అంజీరను ప్రతీ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ వ్యాధుల బారిన పడడం తగ్గుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా అంజీరా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని దూరం చేయడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ ఒక అంజీరాను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావనను కలిగేలా చేస్తుంది.
అంజీరలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ పేషెంట్స్‌కు అంజీర వరం లాంటిదని చెప్పొచ్చు. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంచడంలో కూడా అంజీర ఉపయోగపడుతుంది. అంజీరను రెగ్యులర్‌గా తీసుకుంటే గుండె సమస్యలు దరిచేరవు.
సంతానలేమి సమస్యలను అంజీర దూరం చేస్తుంది. పురుషుల్లో వీర్యం వృద్ధికి, స్త్రీలలో అండోత్పత్తికి అంజీరా ఎంతో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..