ఈ జంతువులు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి!

TV9 Telugu

20 March 2024

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతుజాలం, వృక్షజాలంలో 8 శాతం మన భారతదేశంలోనే ఉన్నాయనంటున్నారు బయాలజీ నిపుణులు.

భారతదేశంలో 104 జాతీయ ఉద్యానవనాలు, 553 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయని నిపుణుల నివేదికలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వేలాది జాతుల జంతువులు ఉన్నాయి. కానీ కొన్ని భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. ఎక్కడ కనిపించవు.

ప్రపంచంలోని పులులలో 70 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. అయితే పాన్ టైగర్లు బెంగాల్‌లో మాత్రమే కనిపిస్తాయి.

ఒక కొమ్ము గల ఖడ్గమృగం భారతదేశం, నేపాల్‌ దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ప్రపంచంలో ఏ దేశంలో ఉండవ్.

ఆసియాటిక్ సింహం భారతదేశంలోని గుజరాత్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఆఫ్రికన్ సింహానికి భిన్నంగా ఉంటుంది.

కాశ్మీరీ హంగుల్, నీలగిరి తహార్, బర్సింగా, కింగ్ కోబ్రా వంటి జంతువులు ఒక్క భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి.

భారతదేశంలో మాత్రమే కనిపించే జంతువులను చూసేందుకు విదేశాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు.