కోపం వల్ల హాని మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలేన్నో..!

TV9 Telugu

31 January 2024

కోపం తీవ్రతలో మన మెదడు పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎప్పుడు కఠినంగా లేదంటే మృదువుగా స్పందించాలో మన మెదడు నిర్ణయిస్తుంది. 

కోపం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయా లేక నష్టాలు మాత్రమే ఉన్నాయా అంటే.. కోపం తెచ్చుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 

కొన్నిసార్లు మన తీవ్రమైన కోపం మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది. విచారం మనల్ని సమస్య నుండి దూరం చేస్తుందని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి. 

మనకు కోపం వచ్చినప్పుడు, మన మెదడు పరిష్కారాన్ని కనుగొనడానికి పనిచేస్తుంది. మరోవైపు, మనం మన కోపాన్ని నిరంతరం అణచుకుంటే, అనేక వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. 

కొన్నిసార్లు మన తీవ్రమైన కోపం మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది.  మీ కోపాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టడం వల్ల డిప్రెషన్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

ఒక్కోసారి అరుపులకే పరిమితమైతే మరి కొన్ని సార్లు గొడవలకు కూడా దారి తీస్తుంది. కోపాన్ని అణచుకోవద్దు, కోపంతో అరవడం వల్ల శరీరంలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మనసు తేలికగా మారుతుంది

కోపాన్ని అణచివేయడం వల్ల గుండెపోటు, కొన్ని రకాల క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కోపాన్ని అణచుకోవడం సరికాదు

సరైన సమయంలో కోపం వస్తే పెద్ద హింసను నివారించవచ్చు. కాబట్టి, మీ కోపాన్ని సమయానికి అర్థం చేసుకోండి. మీకు కోపం వచ్చినప్పుడు, కళ్ళు మూసుకోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి.