ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా భారతీయుడు.?

TV9 Telugu

20 October 2024

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే నంబర్-1 యూనివర్సిటీ. ఇటీవల విడుదలైన ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2025లో ఈ ఘనత సాధించింది.

ఇంగ్లండ్‌లో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వస్తారు. ఇందులో భారతదేశం కూడా ఉంది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ రేసులో అంకుర్ శివ భండారి అనే ఓ భారతీయ వ్యక్తి పేరు ముందంజలో ఉన్నారు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో జన్మించిన అంకుర్ శివ్ భండారీ సెయింట్ ఆంథోనీస్ సెకండరీ స్కూల్, DAV పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు.

ఢిల్లీ యూనివర్సిటీలోని షాహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ నుండి బిజినెస్ స్టడీస్‌లో అంకుర్ శివ్ భండారీ పట్టభద్రుడయ్యారు.

హర్యానా రాష్ట్రానికి చెందిన అంకుర్ శివ్ భండారీకి MBA, మాస్టర్స్ ఇన్ లా సహా అనేక ఇతర డిగ్రీలు పట్టాలు పొందారు.

ఎంబీఏ చేశాక ఇంగ్లండ్ వెళ్లారు. అక్కడ అతను డిమాంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయంలోని లీసెస్టర్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ రేసులో అంకుర్ శివ భండారికి ఈ పదవి వరిస్తుందా లేదా అన్న విషయం చుడాలిక.