రోజూ ఒక ఆపిల్ తింటే అస‌లు ఏం జ‌రుగుతుంది..?

Jyothi Gadda

03 November 2024

TV9 Telugu

చాలా మంది ఆపిల్ పండును కాస్లీగా ఉంటుందని తినేందుకు ఆసక్తి చూపరు. కానీ, ప్రతిరోజు ఒక ఆపిల్ తినడం వల్ల బోలేడు ప్రయోజనాలు కల్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu

ఆపిల్ ను రోజు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతే  కాకుండా ఆపిల్ ను రోజు తినే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

TV9 Telugu

రోజుకు ఒక ఆపిల్ తిన‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగు ప‌డుతుంది. ఆపిల్‌ విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది.

TV9 Telugu

రోజుకు ఒక ఆపిల్‌ తినడం వల్ల శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ రాదు.

TV9 Telugu

ఆపిల్‌ పండ్లు మ‌న ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవ‌కుండా చూస్తాయి.

TV9 Telugu

ఊపిరితిత్తుల్లో క‌ఫాన్ని క‌రిగిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేసి క్యాన్స‌ర్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్యలకు చెక్‌పెడుతుంది.

TV9 Telugu

ఆపిల్‌లో పెక్టిన్ అనే ఫైబ‌ర్ ఉంటుంది. ఇది ప్రీ బ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బాక్టీరియా పెరుగుతుంది.

TV9 Telugu

రోజు ఒక ఆపిల్‌ తినటం వల్ల  మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. 

TV9 Telugu

రోజుకు ఒక యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌కశ‌క్తి సైతం పెరుగుతుంది. దీంతో మెద‌డు యాక్టివ్‌గా ఉంటుంది. బీపీ, షుగర్ లతో బాధపడేవారు ఆపిల్‌ తింటే.. వీటి నుంచి ఉపశమనం

TV9 Telugu